ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. సైకిల్ తొక్కే ప్రతి ఒక్కరికీ ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు. సైకిల్ తొక్కడం అనేది అన్నింట్లోకి అత్యుత్తమ వ్యాయామం. సైకిల్ తొక్కడం వల్ల వ్యక్తికి, సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే సైకిల్ తొక్కండి అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను సైకిల్ తొక్కుతున్నప్పటి ఫొటోను కూడా పోస్టు చేశారు.

