Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలునైరుతి రుతుపవనాలు ఏపీలో మరింత విస్తరించాయి: ఐఎండీ

నైరుతి రుతుపవనాలు ఏపీలో మరింత విస్తరించాయి: ఐఎండీ

దేశంలో నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నేడు మధ్య అరేబియా సముద్రంలోనూ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. రుతుపవనాలు ముందుకు కదిలేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దక్షిణ భారతదేశంలోని మిగిలిన భాగాలకు, దక్షిణ చత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలోని చాలా భాగాలకు మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు చేరుకుంటాయని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article