సెక్షన్ అమలులో ఉంది చింతూరు ఎస్ఐ ఎస్ శ్రీనివాస్
- సెక్షన్ అమలులో ఉంది చింతూరు ఎస్ఐ ఎస్ శ్రీనివాస్
చింతూరు
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 144. సెక్షన్ అమలులో ఉందని, ఆటోవాలాలు తమ వాహనాలను ఎవరి అద్దెకు పెట్టవద్దని చింతూరు ఎస్ ఎస్ శ్రీనివాఎస్ ఆటో వాలాలకు స్పష్టం చేశారు. సోమవారం ఎస్ఐ శ్రీనివాస్ ఆటోవాలాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. ఫలితాలు వెలువడిన తరువాత ఎవరు కాకర్స్ కాల్చడం, ర్యాలీలు తీయటానికి వీలులేదన్నారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషిద్ధం అన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గహించాలన్నారు. పోలీస్ హెచ్చరికలను బేఖాతరు చేసి,నిబంధనలను అతిక్రమిస్తే అట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మంగళవారం ప్రతీ ఒక్కరు తమ తమ ఇళ్ళలో ఉండి,టీవీల్లో ఎన్నికల ఫలితాలను వీక్షించాలన్నారు. ఈ నిభంధనలు అందరికి వర్తిస్తాయని ఎస్ఐ గుర్తుచేశారు.