అమూల్ పాల ధరలను లీటర్ కు రూ. 2 మేర పెంచినట్టు గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పాల ఉత్పత్తి, ఇతర కార్యకలాపాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు తప్పలేదని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ శక్తికి ధరల పెంపు వర్తించనుంది. అయితే, అమూల్ తాజా చిన్న ప్యాకెట్ ను మాత్రం ధరల పెంపు నుంచి మినహాయించినట్టు వెల్లడించింది. ధరల పెంపు మూడు నుంచి నాలుగు శాతం మధ్య ఉందని వివరించింది. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలతో పోలిస్తే ఈ పెంపు తక్కువని కూడా చెప్పింది.
కొత్త ధరలు ఇవే
అమూల్ గోల్డ్ 500 ఎమ్‌ఎల్ ప్యాకెట్ ధర రూ. 33, లీటర్ ప్యాకెట్ ధర రూ. 66
అమూల్ 500 ఎమ్‌ఎల్ గేదె పాల ప్యాకెట్ ధర రూ.36
అమూల్ శక్తి 500 ఎమ్ఎల్ ప్యాకెట్ ధర రూ. 30

