Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుసజ్జలకి అరెస్టు భయం పట్టుకుంది

సజ్జలకి అరెస్టు భయం పట్టుకుంది

-టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి

సజ్జల రామకృష్ణా రెడ్డి పై కేసు రిజిష్టర్ అయిన కారణంగా అతనికి అరెస్టు భయం పట్టుకుందని
టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి

హైకోర్టు న్యాయవాది చిట్టం వెంకటర్ రెడ్డి అనే అతను వైసీపీ నాయకుడు. ఈయన తాడేపల్లి పోలీసు స్టేషన్ లో చంద్రబాబుపై తప్పుడు కేసు ఫిర్యాదు చేశారు. రోత పత్రిక అంటూ కట్టుకథలకు, పెట్టుబడులకు పుట్టిన విష పుత్రిక సాక్షి పత్రిక. అబద్ధాలను, అర్ద సత్యాలను, అసత్యాలను వండి వారుస్తున్న సాక్షి పత్రిక చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని రాసింది. మే 31వ తేదిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ఛీఫ్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వారిని రెచ్చగొట్టేలాగ మాట్లాడి వారందరూ రేపు కౌంటింగ్ ఏజెంట్లకు చెప్పాలని రెచ్చగొట్టాలని, వైసీపీ ఏజెంట్లను బెదిరించమని చెప్పినట్లు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఇంకా కేసుగా రిజిష్టర్ కాలేదు.ఈ కేసుకు ఆధారాలు లేవు, అసలు చంద్రబాబు ఆ మీటింగ్ కే రాలేదు. చంద్రబాబు నిన్న రాత్రి ఉండవల్లికి వచ్చారు. 31న జరిగిన మీటింగ్ లో చంద్రబాబు లేకపోయినా ఉన్నట్లు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ను ఆధారంగా చేసుకొని సాక్షి పత్రిక పెద్ద అక్షరాలతో రాసింది. ఈ రోత సాక్షి పత్రికకు కనీస ఇంగిత జ్ఞానం లేదు. చంద్రబాబు ఈ మీటింగ్ లో ఉన్నాడా? లేడా? అసలు ఈ మీటింగ్ లో ఎవరు ఉన్నారని తెలుసుకోనవసరం లేదా? యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కృష్ణమోహన్, తెనాలి శ్రావణ్ కుమార్, పట్టాభిరామ్ లు వచ్చిన ఏజెంట్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో చంద్రబాబు లేరు. న్యాయవాది వెంకట్ రెడ్డి చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని సాక్షికి ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. దాన్ని సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. జూన్ 4 వ తేది ఈ న్యాయవాది ఏం చెప్పాడో, ఈ సాక్షి పత్రిక రాతలేంటో మేం చూస్తాం. ఇందులో సందేహమేమీ లేదు. అసలు రెచ్చగొట్టింది సజ్జల రామకృష్ణా రెడ్డి. వైసీపీ ఏజెంట్లు రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు, వైసీపీ ఏజెంట్లు పోట్లాడాలని, మెతకవారు ఏజెంట్లుగా కూర్చోవద్దని, దౌర్జన్యాలు చేసేవారు మాత్రమే రండని సజ్జల చెప్పడం పట్ల తెలుగుదేశం పార్టీ తరపున న్యాయవాది గుడపాటి లక్ష్మీ నారాయణ గారు ఆధారాలతో కేసు పెట్టటం జరిగింది. యాక్ట్ 153 ఏ 505 క్లాజ్ 125 కింద కేసు నమోదు చేశారు. సాక్షాలు కూడా ఇచ్చాం. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. సాక్ష్యాలెవరైనా ఉన్నారా అని మాకు ఫోన్లు చేశారు. ఆ పనిలో మేం ఉన్నాం. ఇది పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. దీంతో సజ్జల రామకృష్ణా రెడ్డికి, వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైంది. సజ్జల రూల్స్ పాటించవద్దనడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ కేసు రిజిష్టర్ అయింది. రేపు 4వ తేదిన ప్రభుత్వం మారబోతోంది. మొదటి అరెస్టు బహుశ సజ్జలకే ఉండచ్చేమో. పోలీసులు వైసీపీ నాయకుల మాటలు వినడంలేదని ఆరోపిస్తున్నారు. కౌంటర్ గా చిట్టం వెంకటర్ రెడ్డి ది పంపారు. ఇది తప్పుడు ఫిర్యాదు. సాక్షిలో వచ్చేవన్నీ రోత వార్తలే. ఇంకెన్నాళ్లో లేదు. చేతిలో పేపర్ ఉందని ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు.
ఈ వార్త మీద ఆల్ రెడీ ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశాం. అవినీతి పుత్రిక సాక్షి కథ తేలుస్తాం. సాక్షికి ఎన్ని వేల కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారు, వాలంటీర్లకు సాక్షి పేపర్ ఎలా గవర్నమెంట్ డబ్బులతో పంపారు. ఢిల్లీ కోర్టులో కేసు నడుస్తోంది. దానిపై జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా లాగుతాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక మీ శునకానందం రెండు రోజులు మాత్రమే. కొన్ని పెయిడ్ ఛానల్స్ తో సర్వేలు చేయించుకున్నారు.అవి చూసుకొని ఆనందపడాల్సిందే.ప్రజలు ఆల్ రెడీ తీర్పు ఇచ్చేశారు. మీ నియంతృత్వానికి, మీ అరాచకానికి, అవినీతికి, మీ మోసాలకి ప్రజలు తిలోదకాలిచ్చేశారు. చేతిలో పేపర్ ఉంది కదా అని, లాయర్లు ఉన్నారు కదా అని తప్పుడు కేసులు పెడితే పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబునాయుడును వెంటనే అరెస్టు చేయాలని రాసినందుకు చిట్టం వెంకట్ రెడ్డిని, పేపర్ ఎడిటర్ ని, ఛైర్మన్ ని అందరినీ లాగుతాం. చంద్రబాబును అరెస్టు చేయడానికి ఆయన చేసిన తప్పేంటి? కౌంటింగ్ నిలిచిపోయేలాగ పని చేయాలని చంద్రబాబు చెప్పినట్లు రాశారు. వైసీపీ ఏజెంట్లు భయపడిపోవాలి అని చెప్పినట్లు చెప్పకపోయినా రాశారు. ఈ చిట్టం వెంకట్ రెడ్డి, సజ్జల లు బేంచీల కింద దాక్కొని విన్నారా? మినిమమ్ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కోకుండా చంద్రబాబు వచ్చినట్లు రాశారు. ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు, దాడులు, హత్యలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే చాలా మంది విశాఖపట్నం, విజయనగరం వైసీపీ నాయకులు కలకత్తా, భువేశ్వర్ పారిపోతున్నారు. విజయవాడ, గుంటూరు వాసులు హైదరాబాద్ కు పారిపోతున్నారు. సజ్జల ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన తీరును ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. దమ్ముంటే చంద్రబాబు మాట్లాడినట్లు ఒక్క ఆధారం చూపాలి. మీ కూలి, నీలి మీడియా పని 4 వ తేదితో ఖతం. ఈ అబద్ధాల సాక్షి రోత పత్రిక పని మేం చూస్తామని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article