Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుపాపం ఏబీ..

పాపం ఏబీ..

ఉద్యోగ బాధ్యత..పదవి విరమణ రెండూ ఓకే రోజు
ఐదు సంవత్సరాలు నో జాబ్…
సస్పెన్సన్….కోర్ట్…క్యాట్..కొట్లాట..
బాబు విధేయుడు గా ఉండటమే తప్పిదామా..
నిజంగానే ఉద్యోగ ధర్మాన్ని పాటించలేదా
ఏబీ కుట్రలో సవాంగ్ పాత్ర ఉందా…
నిఘా అధికారిపై అంత నిట్టూర్పులేల…
కులం కూడా కలిసి రాలేదా…
ఠాకూర్ కంటే పెద్ద తప్పిదమే చేశాడా…
జగన్మోహనుడు బాణం సందిస్తే సర్వ నాశమేనా…

అమరావతి:ఏబీ వెంకటేశ్వరరావు ఈ పేరు తెలియని వినని వారు చాలా అరుదు. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో నిఘా అధికారిక పని చేసారు.అదే ఏబీ పాలిట శాపంగా మారిందని చెప్పాలి మరి.గతంలో విజయవాడ సీపీ గా పనిచేసిన సందర్భంలో ఆ తరువాత కాలంలో ఏబీపై ఎలాంటి ఆరోపణలు లేవనే చెప్పాలి.ఉద్యోగ ధర్మం లో ప్రభుత్వాలు మారినప్పుడు బదిలీలు, ప్రాధాన్యత లేని శాఖలు ఇవ్వడమనేది సహజంగా వస్తున్న ఆచారమే అయినప్పటికీ ఓ ఐపీఎస్ ఆఫీసర్ పై దాదాపు ఐదు సంవత్సరాలు ఇలా ఉద్యోగం లేకుండా ఉండటమనేది బహుశా ఏబీకే ఎదురైనదని చెప్పాలి మరి.అయితే ఏబీ వెంకటేశ్వరరావు పై అంతర్గతంగా కొన్ని ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

డీజీపీ ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరించి ఏబీకే అనుకూలంగా ఉన్న ఠాకూర్ కు సఫోర్ట్ గా నిలిచారన్నది అప్పట్లో రూమర్ వినిపించాయి.అయితే వాస్తవానికి ఆర్పీ ఠాకూర్ కంటే ముందు గానే డీజీపీగా ఇంకో అధికారి పేరు ఖరారు కావడం తెల్లారి డీజీపీ గా బాధ్యతలు స్వీకరిస్తాడని పాపం పూల వర్షం కురిపించడానికి మంది మార్బలం రెడీ అయ్యాక అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ కు గాల్లో ప్రయాణం చేస్తున్న సమయంలోనే బాబు క్యాబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న వ్యక్తితో బేరసారాలు జరిగి అనూహ్యంగా డీజీపీ పేరు మార్పు జరగడం తో భంగపాటు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీని ఏమి చేయలేని పరిస్థితి లో ఉండి పోయి అవకాశం కోసం ఎదురు చూసి కాటేసినట్లు కూడా గుసగుసలు వినిపించాయి అప్పట్లో. వాడి పోయిన పూల సాక్షిగా శపథం పూనిన ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి ఓ కారణం అయితే టీడీపీ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఏబీవెంకటేశ్వరరావు ఆఖరికి రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న కొంతమంది ప్రధాన పాత్రికేయుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వినిపించాయి.అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి,ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా తక్కువ భావంతో ఉండడమే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు పిరాయింపు దగ్గర నుంచి ఓటుకు నోటు కేసు లో ఓ కీలక నిందితుడిని అండర్ గ్రౌండ్ కు పంపడములో ఓ సీనియర్ పాత్రికేయుడికి అప్పజెప్పడం జగన్ మోహన్ రెడ్డి ఓటమి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా ఏబీ వాడుకొన్నారనే ఆరోపణలు కూడా అప్పట్లో బాగానే వినిపించాయి.
అలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి పై కుయుక్తులు పన్నడం తోనే ఏబీకి అదికూడా చివరి రోజు ఎన్నికల కోడ్ ఉండటం గౌరవ కోర్ట్ ఆదేశాలు ఇవ్వడం ఆ ఆదేశాలు పాటించక పోతే చర్యలు తప్పవు కాబట్టి విధిలేని పరిస్థితి లో ఏబీ విరమణ రోజైన ఉద్యోగం ఇచ్చి ఆయనకు భారత రాజ్యాంగం ప్రకారం పదవి విరమణ మోక్షము కల్పించారనే చెప్పాలి మరి.అలా ఎందుకు అనాల్సి వస్తుందంటే నాటి కోడికత్తి ఘటన లో ఒక డీజీపీ గా ఉన్న బాధ్యత గల అధికారి చాలా హేలన గా పరిగణనలోకి తీసుకోవడం తో పాటు ప్రెస్ మీట్ పెట్టి మరి కామెంట్ చేస్తే కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేషనరి కి బదిలీ చేశారే తప్ప ఎలాంటి ఇంకో విదంగా చేయలేదు. చివరి పదవీకాలం ఆర్టీసీ ఎండిగా పదవి విరమణ చెందాడు.అంటే ఇదంతా కూడా ఠాకూర్ కేవలం ఓ అధికారి మాత్రమేనని పాత్ర సూత్రధారి ఏబినే అనేది వైసీపీ పార్టీ నేతలు భలంగా విశ్వసించి నట్లు ఆరోజుల్లో చర్చలు జరిగాయి.లేదంటే ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి ఐదు సంవత్సరాలు పాటు పోరాడి చివరి రోజు చావుతప్పి కన్నులొట్ట పోయిందన్న చందంగా పోగొట్టుకున్న పదవి పోరాడి సాదించుకుని పదవి విరమణ చెందడంమనేది అధికార వర్గాల్లో కొంత ఆలోచన ధోరణి రేకిస్తుంది. దీనిని భట్టి అధికారులు తమ స్వామి భక్తిని ఏస్థాయిలో ప్రదార్శించాలో అవగతం చేసుకుంటే మంచిదని మేధావి వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article