Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుశ్రీవారి సేవలో అమిత్​షా…

శ్రీవారి సేవలో అమిత్​షా…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అమిత్ షా దంపతులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.కొద్ది రోజులుగా అమిత్ షా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకూ పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇవాళ తిరుమల శ్రీవారి సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తుది విడత ప్రచారం ముగియడంతో నిన్న సాయంత్రం 6.15 గంటలకు అమిత్ షా దంపతులు రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article