Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుహైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న అంశాన్ని ఏపీ రాజకీయ పక్షాలు వెంటనే లేవనెత్తాలి: మాజీ...

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న అంశాన్ని ఏపీ రాజకీయ పక్షాలు వెంటనే లేవనెత్తాలి: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5 ప్రకారం హైదరాబాద్ నగరం ఏపీ, తెలంగాణలకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీతో ఆ గడువు ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో, సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై లక్ష్మీనారాయణ కొన్ని రోజుల కిందట కూడా స్పందించారు. ఏపీకి ఇంత వరకు రాజధాని ఏర్పడనందున, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగిస్తూ భారత రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article