•పామాయిల్ రైతు సంఘం ప్రతినిధి చాట్రాతి ప్రసాద్.
•నవ భారత్ కి వినతి.
జీలుగుమిల్లి
జంగారెడ్డిగూడెం డివిజన్ నవ భారత్ పరిధిలో ఉన్న రైతులందరూ యాజమాన్యానికి మర్యాదపూర్వకంగా విన్నవించుకుంటున్నారని ఆ సంఘం ప్రతినిధి చాట్రాతి ప్రసాద్ కోరారు.రైతులు ఫ్యాక్టరీ కి పంట ఇచ్చినప్పటి నుండి రైతు ఖాతా లో నగదు జమ అవ్వడానికి ఎక్కువ రోజులు పడ్డటం రైతులకు ఆర్థిక ఇబ్బంది గా మారుతుందన్నారు.పంట కోసాక 15రోజుల పాటు నగదు అందకపోవడం తో ఒకవైపు కూలీలకు వేతనాలు చెల్లింపు,అలాగే సాగుకు సంబంధించి ఎరువలు కొనుగోళ్ల విషయం లో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు.దీనికి గాను ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులందరూ ఏకగ్రీవంగా యాజమాన్యాన్ని వారం రోజుల గడువు లోగా రైతుల కు నగదు చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.