తనకల్లు.
తెలుగుజాతి కీర్తి కిరీటం,
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించారు మంగళవారం తనకల్లు తోట సరోజమ్మ మహిళా కేంద్రంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను జరుపుకున్నారు.
ఈసందర్బంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవం,ప్రజల సంక్షేమం,రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్.అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా. నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభిరుద్ది కోసం పని చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి,శంకర్ నాయుడు, సోపాళ్యం నాగభూషణ, చెన్న కృష్ణ, పిజీ మల్లికార్జున,మీరాసి వేమనా రాయణ, మాజీ ఎంపీటిసి రెడ్డెప్పరెడ్డి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.