ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంతి యెర్నేని సీతాదేవి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సీతాదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్రవేశారని చంద్రబాబు కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. యెర్నేని సీతాదేవి ఇవాళ ఉదయం హైదరాబాదులోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ముదినేపల్లి నుంచి రెండు పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 2013లో బీజేపీలో చేరారు.