చింతూరు
చింతూరు నుండి రాజమండ్రి వెళ్ళే ఘాటి రోడ్డు (మారేడుమిల్లి) ఘాటీలో ఆదివారం పొద్దుపోయే సమయంలో పెద్ద ట్రాక్ రోడ్డు మూల మలుపు వద్ద అడ్డంగా ఇరుక్కుంది. ట్రాక్ భారిది కావటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ట్రాఫిక్ నిలిపివేసి, ట్రాక్ ను అక్కడి నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.