హిందూపురం టౌన్
పట్టణంలోని కొట్నూరులో ఉన్న నిర్మలా వృద్ధాశ్రమంలో ఆదివారం బెంగళూరుకు చెందిన సప్తగిరి మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వైద్యులు ఉచిత మెగా వైద్య శి బిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు అక్కడ ఉన్న వృద్ధులకు ఈసీజీ, బివి, షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్న వారందరికి మందులను పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ, తరచు వృద్ధాశ్రమంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైష్ణవి, ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వైద్య శాల కో ఆర్డినేటర్ జయవర్ధన గౌడ్, అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్, ఉబేదుల్లా హుసేన్, రహమాన్ బాబన్న, జానప్ప, అంజినప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.