Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుసిరివెన్నెల చెప్పింది నిజమేనా…

సిరివెన్నెల చెప్పింది నిజమేనా…

ప్రాణం పొసే డాక్టర్…గానం విలువ తెలియని వీరు డాక్టర్లేనా
నిగ్గదీసి అడగాలా ఈ సిగ్గులేని జనాన్ని….
సిద్ధాంతీకరణ తెలియనివారికి కూడాగౌరవ పీహెచ్డీలా
అగ్గితోటి కడగాల ఈ సమాజ జీవచ్చవాన్ని…
సిగ్గుతోటి చావాలా ఈ జనాలు…
ఈ దేశం గుడ్డిదా…గుర్తించ లేనిదా…వీరి ప్రతిభ
మారదా ఈలోకం .. మారదా ఈ కాలం
పరాయిదేశాలు ఇచ్చాయా…ఆ పేరు చెప్పుకుంటున్నారా
దేవుడు దిగి వచ్చిన యెవ్వరు యేమై పోయినా వీరు వీరేనా
అడగాల్సింది..కడగాల్సింది ఈ జనాన్నా…ఈ జనులనా..
ఏమిటీ ఈ అవార్డులు… రివార్డులు…
ఈ భారతావని ఈ చరిత్ర కారులనెందుకు విస్మరిస్తోంది…
బలవంతులే బ్రతకాలన్న సూక్తి నిజమేనా…
బెదిరిస్తే భయపడి పోవాలా…
వేట అదే వేటు అదే నాటీ నేటి కథ అంతా ఒకటేనా….
సిగ్గుపడాల్సింది చదివిన వారా….చదివమన్న వారా….ఈ సమాజమా..
అర్హత లేని వారికిచ్చారంటే..ఇచ్చేవారు ఇంకెంత గొప్పవారో …
ఉన్నత పదవుల్లో ఉన్నవారికి తెలియదా..
తెలిసినా మౌనంగా ఉన్నారంటే మర్యాదలకోసమా…
ఇంకెన్నాళ్లీ దూరాఘాతం….
కళామతల్లి ఇంకెన్నాళ్లీ కుట్రలు

విజయవాడ:'”నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలందేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలంగాలి వాటు గమనానికి కాలి బాట దేనికిగొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికియే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠంయే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గంరామబాణమార్పిందా రావణ కాష్ఠంకృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రంపాత రాతి గుహలు పాల రాతి గృహాలయినాఅడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినావేట అదే వేటు అదే నాటి కధే అంతానట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతాబలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండాశతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండదేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోనిమారదు లోకం మారదు కాలం”అని రెండు దశాబ్దాల క్రితమే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సమాజ పోకడలపై ఎలెత్తి చూపుతూ జనప్రభంజ నాన్ని చైతన్యం కలిగించేలా గాయం అనే సినిమా ద్వారా పాటపాడి చూపారు. అయిన ఈ లోకం మారలేదు.అనేక విప్లవ గేయాలు ,రచనలు వచ్చిన వాటిలో ఏ విధమైన లోపాలు ఉన్నాయో వెతికి మరి సమాజాన్ని ఎలా దోచుకోవాలో ఎంచుకున్నారు..ఇప్పటికీ ఎంచుకుంటూనేఉన్నారు.అయిన లోకం తీరు మారలేదు. ప్రజల బలహీనతే ప్రధాన ఆయుధాలు చేసుకుని సిగ్గు ఎగ్గు లేకుండా దోచుకుతింటూ కూడా దానికి సేవ అనే నామకరణం చేసి ఆసేవ ముసుగులో దోచుకోవడం దాచుకోవడం అలవాటై పోయింది ప్రస్తుత సమాజంలో. కళ అనే సేవముసుగులో చేస్తున్న వింత పోకడలు అచ్చర్యానికి గురిచేస్తున్నాయి.వైద్యోనారాయణ హరి అన్నారు పెద్దలు. వైద్యం అందించే వారు దేవుడితో సమానమని కొలుస్తారు వారిని డాక్టర్లు అంటారు…వారు పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకుంటారు.ఇది ఒక రకం. ఇక రెండోవది ఒక విద్యార్థి తన అనుభవాలను రంగరించి ఈ సమాజానికి ఉపయోగపడే నూతన అవిష్కరణ పై అనేక రకాలుగా అధ్యయనం చేసి దేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంనుండి ఆమోదం పొందిన తరువాత ఆ విద్యార్థి ఏ విశ్వవిద్యాలయం నుండి హాజరయ్యాడో ఆ విశ్వవిద్యాలయ కులపతి నుంచి పీహెచ్డీ పట్టా పొందితే వారు కూడా తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుంటారు.కానీ నేడు భిన్నమైన, విభిన్నమైన ధోరణి ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చోటిచేసుకోవడం ఇక్కడి విద్యార్థులు, మేధావులు చేసుకున్న దౌర్భాగ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి కళ అంటే తెలియదు,గానం లేదు,గాత్రం ఉండదు,సఫాస తెలియదు వీరంతా డాక్టరేట్ పొందిన మహనీయులట. వ్యాఖ్యానాలు చేస్తే డాక్టరేట్,సాలువాలు కప్పి సన్మానాలు చేసి ఆ సన్మానాల వెనుక సంపాదన ఉన్నా డాక్టరేట్ చివరికి యాచకుడికి కూడా డాక్టరేట్ ఇప్పించే స్థాయికి కొంతమంది బ్రోకర్లు తయారవ్వడం శోచనీయం. ఓ అధినేత అయితే తానే డాక్టరేట్ ఇచ్చే విదంగా లైసెన్స్ తెచ్చుకుని ఇక అందరికి ఇవ్వడానికి సిద్ధమని బహిరంగంగా చెప్పడం చూస్తే ప్రాణం పొసే డాక్టర్ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. వీరనంట కళామతల్లి కోసం కష్ట పడి పోషిస్తుంది. నిస్సిగ్గుగా కళామతల్లిముసుగులో ఉన్న ఈ నకీలీ గాల్లా భరతం పట్టే రోజులు రాకపోవా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు కళామతల్లి బిడ్డలు మేధావులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article