గాజువాక:
బుద్ధుడు తాత్విక చింతనలో మానవులందరూ సమానం అని ప్రవచించి, మన చుట్టూ ఉన్న అన్నిటిని శాస్త్రీయ దృక్పథం చూడటానికి ప్రయత్నించాడు. కులవ్యవస్థలోని ఎక్కువతక్కువలను నిరసించాడు. ఆనాడు యజ్ఞ యాగాదుల కోసం హింస ప్రవృత్తి తోటి జంతు బలులు ఆచారాలను వ్యతిరేకించి శాంతి దృక్పథాన్ని బోధించాడు.
సమస్త మానవజాతి అష్టాంగ మార్గం ఆచరించాలని సూచించాడు. అష్టాంగ మార్గాలైన మంచి పనులు,
మంచి జీవితం, మంచి ప్రయత్నం,మంచి దృక్పధం,
మంచి ధ్యానం,సత్యాన్ని చూడడం, మంచి సంకల్పం తో మానవులు ఆచరిస్తే సమాజంలో శాంతి, సమానత్వం, సౌబ్రాతత్వం
వెళ్లివిరుస్తుందని అదే మానవుల్లో అతి ఉత్తముడైన బుద్ధునికి మనం ఇచ్చే నివాళి.
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి.

