కామవరపుకోట
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల పరిషత్ అధ్యక్షురాలు మేడవరపు విజయలక్ష్మి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల పరిషత్ అధికారిని జె స్వర్ణ భారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.ఏలూరు జంగారెడ్డిగూడెం ఎన్హెచ్ 41 లో రోడ్డుకు ఇరువైపులా ర్యాంపులు ఏర్పడ్డాయని రోడ్డుపైన కూడా గొంతులు ఏర్పట్టాయని వాటిని తాత్కాలిక పద్ధతి పైన అయినా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆమె సూచించారు. మండలంలో రోడ్డుకు ఇరువైపులా సీసీ రోడ్లు మధ్యన విద్యుత్ స్తంభాలు గ్రామస్తులకు ఆటంకంగా ఉన్నాయని వాటిని కూడా వారం రోజులలో తొలగించాలంటూ ఆమె విద్యుత్ అధికారులకు అల్టిమేట్ జారీ చేశారు లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ వర్షాకాలం సీజన్లో ఎన్ ఆర్ జె సి ఆధ్వర్యంలో హెచ్ ఓ వద్ద 16 రకాల పంటలకు సంబంధించి పనులు చేయించుకోవడం కోసం అవకాశం ఉందని పండ్ల తోటలు సాగు చేసుకునేటందుకు ఎనర్జీసీ ఆధ్వర్యంలో బిల్లులు అవుతాయని ఏపీఓ అన్నారు. జంగారెడ్డిగూడెం బస్ డిపో ఆధ్వర్యంలో 87 సర్వీసులు నిరంతరం సర్వీసులు నడుస్తున్నాయని సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.వి లక్ష్మి అన్నారు. వీటిలో కొన్ని బస్సులు ఆటంకాలు ఏర్పడిన గత కొంతకాలం నుండి కొత్త బస్సులు ఏమీ లేవని ఆమె సభ దృష్టికి తీసుకొని వచ్చారు. సభలో పలువురు ఆమె దృష్టికి ఆర్టీసీ బస్సులు ఎక్కడబడితే అక్కడ చక్రాలు ఊడిపోతున్నాయని ఆగిపోతున్నాయని దృష్టికి తీసుకొని రాగా పై విషయాన్ని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో మండల లోని పలు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో చేసిన పలు పనులకు బిల్లులు నేటి వరకు రాలేదని సభ దృష్టికి తీసుకుని వచ్చారు దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు ఎన్నికల షెడ్యూల్ అనంతరం తపాలు వారీగా బిల్లులు మంజూరు అవుతాయని ఆయా సర్పంచ్లకు చెప్పారు. కామవరపుకోట సర్పంచ్ కర్రీ పోతుఅనుష భాగ్యరాజుకు భారతదేశపు శక్తిమంతు సర్పంచ్ గా పంచాయితీ సర్పంచ్ కు గుర్తింపు వచ్చిందని కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు తమ్మిశెట్టి గిరిజ సుబ్రహ్మణ్యం ,జడ్పిటిసి కడిమి రమేష్ ,పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

