అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ !చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు!
ఇది వేలేరుపాడు మండల కేంద్రంలోని దుస్థితి!

వేలేరుపాడు :పారిశుద్ధ్య పనులపై జిల్లా అధికారులు జారీ చేసిన ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయే తప్ప వేలేరుపాడు మండలంలో కనీస పనులు ప్రారంభం కాకపోవడం విశేషం, జిల్లా పంచాయతీ అధికారి ఈనెల 17 నుంచి వెలేరుపాడు, కుక్కునూరు మండలాలలో పారిశుధ్య పనులు ప్రారంభించాలని ప్రకటించారు, అవి వేలేరుపాడు మండలంలో ఎక్కడ ప్రారంభించిన దాఖలాలు లేకపోయేసరికి జిల్లా అధికారుల ఆదేశాలను సైతం ఇక్కడ కార్యదర్శులు పరిగణలలోకి తీసుకోరా? అన్న ప్రశ్నలు ప్రజల నుంచి విరివిగా వినిపిస్తున్నాయి, మండల కేంద్రమైన వేలేరుపాడులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో, దుర్భర వాతావరణం తో పాటు చిన్నపాటి వాన పడ్డ ప్రధాన కూడళ్ళు చెరువులను తలపిస్తున్నాయి, ఈ పరిస్థితి మండలంలోని ప్రధాన గ్రామపంచాయతీయులైన రేపాక గుమ్ము, తాటుకూరుగుమ్ము ఇరు పంచాయతీలకు సంబంధించింది కావడం విశేషం, ఒకరిపై ఒకరు వంతులు పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న ఆరోపణలు లేకపోలేదు, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న వర్షాకాలంలో ప్రధాన వీధులకు ఇరువైపున గల ఈ రెండు గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలు రోగాల బారిన పడటం ఖాయమన్నది ఇప్పటికే స్పష్టమవుతుంది, గత సంవత్సరం నుంచి ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నామని ఏ అధికారికి చెప్పిన పట్టించుకోవడంలేదని వాపోవటం బాధిత ప్రజల వంతు అయింది, ప్రస్తుతం జిల్లా అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఉన్నారంటే, ఇక ఈ దుర్భరాన్ని భరించాల్సిందేనా? అన్న ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు, ఈ విషయంపై ఉన్నతాధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది వేసి చూడాల్సిందే!


