జిల్లాలో 8 చోట్ల కేంద్ర సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్ లు
178 మంది రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్ కు కౌన్సెలింగ్
5 ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు
జిల్లా ఎస్పీ గౌతమిశాలి ప్రత్యేక దృష్టి
అనంతపురము జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో జిల్లాలో సమస్యలు సృష్టించే వారిని, వారి స్థావరాల్లో పోలీసులు జల్లెడపడుతున్నారు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 866 మందిపై గురువారం పోలీసులు బౌండోవర్లు చేయించారు. కౌంటింగు ప్రక్రియ, ఆ తర్వాత కూడా ఎలాంటి హింసా ఘటనలకు పాల్పడకుండా ముందస్తు చర్యలులో భాగంగా బౌండోవర్ కేసులు నమోదు చేశారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో కేంద్ర సాయుధ బలగాలచే 8 చోట్ల ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించారు. జిల్లాలో ఉన్న 178 మంది రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్ కు కౌన్సెలింగ్ నిర్వహించారు. రాయదుర్గం, శింగనమల, పుట్లూరు, ఆత్మకూరు, తాడిపత్రి పట్టణాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. డీఎస్పీలు, సి.ఐ.లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్ల, కర్నాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో, పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అల్లర్లు, గొడవల జోలికెళ్లకుండా ప్రశాంతంగా మెలగాలని… లేదంటే చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని ఆయా పోలీసులు సూచించారు.