హిందూపురంటౌన్
హిందూపురం రూరల్ మండలం సంతేబిదనూరు గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి రధోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుండి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చనలు, నిర్వహించారు. మూలవిరాట్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసిపి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, వేణురెడ్డి తదితరులుపాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఇదే సందర్భంగా నవీన్ తో పాటు వైసిపి నాయకులు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాంజి, మంజు, మానెంపల్లి వేణు రెడ్డి, సర్పంచ్ నాగేంద్ర, నరసింహ రెడ్డి, గ్రామ పెద్దలు, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.


