- బహిష్కరణకు గురైన 8 మందికి నోటీసులు అందజేసిన పోలీసులు
- జిల్లా హద్దులు దాటించిన పోలీసులు
అనంతపురము
జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను పోలీసులు అమలు పరిచారు. బహిష్కరణకు గురైన 8 మందికి నోటీసులు అందజేసి జిల్లా హద్దులు దాటించారు. మట్కాతో పదే పదే సంబంధాలు కొనసాగిస్తున్న నలుగుర్ని… ఇతర రాష్ట్రాల మద్యంకు సంబంధించిన కేసుల్లో నిందితులు ఇద్దర్ని… ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్న మరో ఇద్దర్ని మొత్తం 08 మందిని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ప్రతిపాదనల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ 8 మందిలో ముగ్గురికి ఈ ఏడాది జులై 15 వరకు… మిగితా ఐదుగురికి మూన్నెళ్ల పాటు జిల్లా బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అమలులో భాగంగా ఆయా పోలీసులు నోటీసులు అందజేసి జిల్లా దాటించారు.
బహిష్కరణ వేటుకు గురైన 8 మంది వివరాలు…
1) గడి మాబు అలియాస్ గాడి మాబు అలియాస్ సి.మాబు, వయస్సు 63 సంవత్సరాలు, శాంతినగర్, గుంతకల్లు (మట్కా)
2) కడపల వెంకటరాముడు అలియాస్ వెంకటరమణ అలియాస్ కోడి వెంకట రాముడు, వయసు 37 సంవత్సరాలు, రాణి నగర్, అనంతపురం(మట్కా)
3) దూదేకుల అబ్దుల్ అలియాస్ అబ్దుల్లా వయస్సు 55 సంవత్సరాలు, మెయిన్ రోడ్డు, గార్లదిన్నె మండల కేంద్రం(మట్కా)
4) షికారి భగవాన్ అలియాస్ షికిరి భగవాన్, వయస్సు 53 సంవత్సరాలు, బుడ్డప్ప నగర్, అనంతపురం (ఎన్డీపీఎల్)
5) అంకె నారాయణ అలియాస్ అంకె నారాయణస్వామి, వయసు 36 సంవత్సరాలు, గంగవరం గ్రామం, బెలుగుప్ప మండలం (ఎన్డీపీఎల్)
6) చాకల చలపతి అలియాస్ మీసాల చలపతి, వయసు 60 సంవత్సరాలు, తారకరామాపురం కొట్టాల, వేణుగోపాల్ నగర్, అనంతపురం (మట్కా)
7) ఎరికల ముత్యాలన్న అలియాస్ ముత్యాలు అలియాస్ ముత్యాలప్ప అలియాస్ జోల్లోడు, వయస్సు 32 సంవత్సరాలు, గుండ్లపల్లి కాలనీ, కంబదూరు మండల కేంద్రం (గుండా)
8) ఎరికల శేఖర్ అలియాస్ ఎరుకుల రాజశేఖర్ అలియాస్ గుండబండ, వయస్సు 27 సంవత్సరాలు, కంబదూరు మండల కేంద్రం (గూండా)

