చింతూరు :ఇటివల ముగిసిన సార్వత్రిక ఎన్నికలకు సహకరించినట్లుగానే, నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు,ఫలితాల నేపథ్యంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా సహకరించాలని,చింతూరు సర్కిల్ పరిధిలోని వై.రామవరం మండలం, డొంకరాయి ఎస్.ఐ శివకుమార్ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు పిలుపు నిచ్చారు. బుధవారం పోలీస్ ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు డొంకరాయి పోలీస్ స్టేషన్ లో స్థానిక ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో ఎస్.ఐ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా, ఎన్నిక అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల పై ఈ.సి తీసుకున్న చర్యలను ఎస్ ఐ గుర్తుచేశారు. కేసుల పరిణామాలు, కేసుల్లో ఇరుకున్న వారికి భవిషత్ లో ఎదురయ్యే పరిణామాలను వెల్లడించారు. ఫలితాల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా, గొడవలకు పాల్పడిన, అందుకు పురిగొల్పినా, అట్టి వారిపై శాఖ పరంగా ఖఠిన చర్యలు ఉంటాయని ఎస్ ఐ హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఎస్ ఐ కృతఙ్ఞతలు తెలిపారు. ఫలితాను అదే విధంగా కొనసాగించాలని కోరారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది, మండల పరిధిలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.