కడప అర్బన్
ఈ రోజు కడప నగరం లోని ప్రముఖ హాస్పిటల్ అయిన అరుణచల ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ నందు వరల్ట్ హైపర్ టెన్షన్ డే సందర్భముగా ప్రముఖ మందుల కంపెనీ అయిన గ్లేన్ మార్క్ కంపెనీ వారి ఆధ్వర్యములో కడప ప్రజలకు రక్తపోటు నియంత్రణపై అవగాహన కార్యక్రము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం లో హాస్పిటల్ అధినేత అయిన డాక్టర్ నిరంజన్ రెడ్డి మరియు డాక్టర్ మమతేశ్వరి పాల్గొన్నారు. డాక్టర్ మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవిత కారణంగా చాలా మంది ఒత్తిడికి లోను అవుతూ ఉన్నారు. రక్త పోటు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పనిలో శారీరక శ్రమ లేకపోవడం కారణంగా మరియు ఎక్కువ గా ఆలోచించడం, కూర్చున్న చోట నే పని చెయ్యడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బరువు పెరిగిన కారణంగా అనేక వ్యాధులకు గురి అవుతున్నారు అని చెప్పారు.
30 సంవత్సరాలు దాటిన వారు ప్రతిఒక్కరు ఎక్కువగా బిపి బారిన పడుతున్నారు. దీనికి కారణం సరైన వ్యాయామా లేకపోవడం మరియు మంచి ఆహారం అలవాట్లు లేకపోవడం, అధికబరువు కల్గి ఉండటం కావున ఈ ముప్పు నుంచి బయటపడాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండ వ్యాయమం చేయడం,ఆహారంలో ఉప్పును తగ్గించడం. మరియు సకాలంలో బిపి మందులు వాడటం మంచిది అన్నారు. అనంతరం పట్టణం లో అవగాహన కార్యక్రమం నిర్వహంచారు. ఈ కార్యక్రమములో గ్లేన్ మార్క్ మేనేజర్ శ్రీశైలం, కే శివ కృష్ణ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.