Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుపోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం.. వీడియో వైర‌ల్!

పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం.. వీడియో వైర‌ల్!

చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన శివ‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో సైకో శివ మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ.. మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని చల్లపల్లిలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్‌చ‌ల్‌ చేశాడు. ఈ క్ర‌మంలో శివను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్ర‌ గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article