తాజా వార్తలుఅపర్ణ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

అపర్ణ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

గొల్లప్రోలు

  గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని శ్రీ అపర్ణా సమేత నాగేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ సతీ సమేతంగా సందర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, స్వర్ణ శ్రీ దంపతులు అపర్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు దైవజ్ఞ రత్న ఆకొండి వెంకటేశ్వరశర్మ,ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి ప్రభాకర శాస్త్రి వేదమంత్రాలతో స్వాగతం పలికి ఆలయ విశిష్టతను తెలియజేశారు. అనంతరం అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారి చిత్రపటాన్ని, వ్రతకల్ప పుస్తకాన్ని కమీషనర్ దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గారపాటి బుజ్జి, గ్రామ ఉపసర్పంచ్ దాసం వెంకటేష్ పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article