‘ఎక్స్’ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపిన బన్నీ
నేడు 41వ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్‌టీఆర్‌కు సీని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘హ్యాపీ బర్త్‌డే తారక్ బావ.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి’ అని ట్వీట్ చేశాడు. అలాగే నిన్న దేవర మూవీ నుంచి విడుదలైన ఫియర్ సాంగ్‌ను ఉద్దేశించి.. ‘FEAR is FIRE’ అని రాసుకొచ్చాడు. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివతో దేవర చేస్తున్న ఎన్‌టీఆర్.. ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ అడుగు పెడుతున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2లో నటిస్తున్నాడు. ఇక దేవర చిత్రం రెండు పార్టులుగా రానుందని సమాచారం. దసరా కానుకగా పార్ట్-1 విడుదల కానుంది. దీనిలో భాగంగా ఆదివారం విడుదలైన ఫియర్ సాంగ్ కూడా అభిమానులను అలరిస్తోంది.