Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుతెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, ములుగు, పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, యాదాద్రి, మహబూబాబాద్, నల్గొండ, జోగులాంబ గద్వాల్, హనుమకొండ, వరంగల్, వనపర్తి, నారాయణపేట, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.నేడు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article