మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎల్ అండ్ టీ పనులను ప్రారంభించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుకమేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వెంటనే పనులను చేపట్టాలని ఎల్ అండ్ టీ సంస్థకు ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ బ్లాక్-7లోని 8 గేట్లను ఎత్తివేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి.