కుకునూరు
కురుములతోగు గిరిజనులకు వైద్యం ఖర్చులు ప్రభుత్వమే చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శి నాగేంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం నాడు సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం సుందరయ్య భవనం ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ మండలంలోని గిరిజన గ్రామం కురుములతోగులో మంచినీరు సౌకర్యాలు లేకపోవడంతో వర్షాలకు వాగులు కాలవల ద్వారా వచ్చిన మురుగునీరు బావిలో చేరడం వలన ఆ నీరు త్రాగి గిరిజనుల మృత్యువాత పడుతున్నారు కురుములతోగులో రెండు మరణాలు జరిగితే కానీ ప్రభుత్వానికి చలనం లేదని 25 ఏళ్లగా అక్కడ గిరిజనులు నివాసం ఉంటే చేతి పంపగానే విద్యుత్ సౌకర్యం కానీ ప్రజాపతి నిధులు అధికారులు కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు అవి కల్పించి ఉంటే ఇప్పుడు రెండు ప్రాణాలు పోయేవి కావని అన్నారు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లే గిరిజనులకు వైద్యానికి అయిన ఖర్చుని ప్రభుత్వం చెల్లించాలని ఆ ప్రాంతాల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి గిరిజన ప్రాణాలు కాపాడాలని వారికి శాశ్వతంగా మంచినీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలని సమస్యలు వచ్చినప్పుడు కాకుండా అన్ని సందర్భాల్లో ప్రభుత్వం వారిని పట్టించుకోవాలని నాగేందర్రావు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సాయికిరణ్ మేడిపల్లి బాబు శ్రీను లక్ష్మయ్య శ్యామల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు