కుకునూరు:మండలంలో అపరిశుభ్రత వల్ల కురుమల తోగు గ్రామంలో కలుషిత నీరు త్రాగి ఇద్దరు మృతి చెందిన తర్వాత మండలంలో అధికారులు మేల్కొని ప్రతి పంచాయతీలో హడావుడిగా పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలుపెట్టారు ఈ కార్యక్రమాలు ముందుగానే ప్రతి పంచాయతీలో చర్యలు తీసుకుని ఉంటే ఇద్దరు ప్రాణాలు కోల్పోయే వారు కాదని స్థానిక ప్రజలు చర్చించుకోవడం శోచనీయంగా మారింది ఇప్పటికైనా అధికారులు చేస్తున్న ఈ పరిశుభ్రత కార్యక్రమాలు ఎప్పుడు కొనసాగితే మునుమందుపడే వర్షాల నుండి పలు అంటూ వ్యాధులు ప్రబలకుండా అన్ని విధాల ప్రజలను కాపాడిన వారు అవుతారని ప్రజలంటున్నారు అపశృతి జరిగినప్పుడే కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి పరిశుభ్రత కార్యక్రమాలు ప్రతి పంచాయతీ వారు చేపట్టినట్లయితే ఈ రోజున ఈ దుస్థితి నెలకొనేది కాదని ప్రజల చర్చించుకోవడం శోచనీయంగా మారింది అధికారులు మేల్కొని ప్రజారోగ్యంపై ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచి పరిణామమని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక ఎప్పుడు అపరశుభ్రత వల్ల అ అతిసార ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజున నీ మంచినీరు అందించే ట్యాంకులను క్లీన్ చేయిస్తున్నారు ఎక్కడ మురుగునీరు చేరిన అక్కడ పరిశుభ్రంగా చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు ఇదేవిధంగా ఈ కార్యక్రమాలు ప్రతి నెల కొనసాగాలని స్థానికులు కోరుకుంటున్నారు

