లోక్ సభ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో టీఎస్ఆర్టీసీ 3,500 పైచిలుకు బస్సులను ప్రత్యేకంగా నడిపింది. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడిపింది. దీంతో ఆ ఒక్కరోజు టీఎస్ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది. ఆ రోజు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు.దీంతో సంస్థకు రూ.24.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్నికల మరుసటిరోజున 54 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. టిక్కెట్ కొనుగోలు చేసినవారి ద్వారా రూ.15 కోట్ల ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం… టీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది.