బద్వేల్: బద్వేల్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో నీ 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సారధ్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయమ్మ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన కేంద్రంలో మోడీ పాలనతో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు ఇప్పటి ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇసుక దోపిడి మద్యం మాఫియా గంజాయి అమ్మకాలతో వేల కోట్లు సంపాదించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు కూటమిలో భాగమైన మన బద్వేల్ నియోజకవర్గం బిజెపికి ఇవ్వడంతో మనమందరం కమలం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా బొజ్జ రోషన్లను గెలిపించాలని అన్నారు యాదవ సంఘ నాయకులు సుబ్బరాయుడు యాదవ్ గుజరాత్ మాట్లాడుతూ వైయస్ఆర్ సీపీ పార్టీలో చాలా నష్టపోయానని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు పథకాలకు ఆకర్షితులై మా ఐదో వార్డులో నీ 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో టిడిపి పార్టీ లోకి చేరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి టిడిపి నాయకులు సింగరయ్య గురు రాజా ,భూపాల్ రెడ్డి , రాంబాబు ,లాయర్ ప్రసాద్ ఫయాజ్ ప్రశాంత్ తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు