రామచంద్రాపురం
2019 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన రీపోలింగ్ కేంద్రాలను చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కైలాస్ వాంఖడే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.రామచంద్రపురం మండలంలోని కుప్పం బాదూరు, సికేపల్లి, ఎన్ ఆర్ కమ్మపల్లి, గణేశ్వర పురం, కమ్మపల్లి, వెంకటరామపురం పోలింగ్ కేంద్రాలను చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కైలాస్ వాంఖడే పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గత అనుభవాల దృశ్య ఈ ఎన్నికలలో అటువంటి పొరబాట్లు జరగకుండా గట్టి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లు అందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ ఉషారాణి, ఆర్ఐ కృష్ణమ్మ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు