మార్కాపురం :మార్కాపురం పట్టణంలోనివైసీపీ మైనార్టీ నేత సయ్యద్ గౌస్మోహిద్దీన్ మాట్లాడుతూవార్ వన్ సైడ్ అన్నట్లుగా ఈ సారి ఎన్నికలు ఏపీలో జరగనున్నాయని వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శ సయ్యద్ గౌస్ మోహిద్దీన్ వెల్లడించారు. ఫ్యాన్ ప్రభంజనం ముందు సైకిల్, గ్లాస్, కమలం కొట్టుకొనిపోకతప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఒంగోలు లోక్ సభఅభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి అన్న రాంబాబు ల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం ఇప్పటికే ఖాయమై పోయిందని, భారీ మెజార్టీపైనే తప్ప ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరుతూ ఆయన మార్కాపురం పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్డీయే కూటమితోె చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఏకమై వస్తే సింహం సింగిల్ గా వస్తుందన్నట్లుగా సీఎం జగన్ ఒంటరిగా పోరాటంలోకి దిగారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గురించి తప్పా ఎన్డీయే ఆలోచన ప్రజలలో ఏ మాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వాస్తవం ఎన్నికల ఫలితాలలో తేలిపోతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు గెలుపును ఏవరూ ఆపలేరని, వారి విజయాన్ని ఎన్డీయే కూటమి అభ్యర్థులుచూడటం తప్పా ఏమీ చేయలేరని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ పేర్కొన్నారు.

