Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుపవన్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు : పోతిన మహేశ్

పవన్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు : పోతిన మహేశ్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ మరోమారు దాడి ప్రారంభించారు. పవన్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. 2014లో పవన్ మాట్లాడుతూ తానో సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని, కారు ఈఎంఐ కట్టకపోతే పట్టుకెళ్లిపోయారని చెప్పారని, అలాంటి పవన్ ఆస్తులు ఇప్పుడు రూ. 1500 నుంచి రూ. 2 వేల కోట్ల వరకు ఉన్నాయని ఆరోపించారు. ఇది తనకు తెలిసిన లెక్క అని, తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇలా ఉన్న వ్యక్తి ఈ పదేళ్లలో అలా సంపాదించడానికి గల కారణమేంటో చెబితే పేదలు కూడా సంపాదించుకుంటారని పేర్కొన్నారు.పవన్ రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న తనలాంటి వారినందరినీ అమ్ముకుని వేలకోట్ల ఆస్తులు, భూములు సంపాదించారని ఆరోపించారు. మార్పు కోసం తమను పనిచేయమన్న పవన్.. ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరులాగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక పార్టీని మూసేస్తే.. పవన్ మాత్రం పార్టీ పెట్టడానికి ముందే చంద్రబాబుకు అమ్మేసి, డబ్బులు తీసుకుని పార్టీ పెట్టారని ఆరోపించారు. పవన్‌ను ఒక పొలిటికల్ ఫోర్‌ట్వంటీ అని తీవ్ర విమర్శలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article