Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుజీవిత భాగస్వామి ఉండగా ‘సహజీవనం’ ముస్లిం సూత్రాలకు విరుద్ధం: అలహాబాద్ హైకోర్ట్ తీర్పు

జీవిత భాగస్వామి ఉండగా ‘సహజీవనం’ ముస్లిం సూత్రాలకు విరుద్ధం: అలహాబాద్ హైకోర్ట్ తీర్పు

జీవిత భాగస్వామి ఉండగా వేరొకరితో సహజీవనంలో ఉండే ముస్లింలు హక్కులు పొందలేరని, అలాంటి సంబంధం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ అనే ఇద్దరు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఏఆర్ మసూది, ఏకే శ్రీవాస్తవలతో కూడిన లక్నో బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ స్నేహా దేవి తల్లిదండ్రులు మహ్మద్ ఖాన్‌పై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో ఆమెను భద్రతతో తల్లిదండ్రుల వద్దకు పంపించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా తాము స్వేచ్ఛగా జీవించేందుకు రక్షణ ఇవ్వాలంటూ పిటిషనర్లు స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ కోరారు. అయితే అలా సాధ్యపడదని కోర్టు తేల్చిచెప్పింది. సహజీవన స్వేచ్ఛకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ లక్నో బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ ఇస్లాం మత సూత్రాలు సహజీవన సంబంధాలను అనుమతించవు. ఇద్దరు వ్యక్తులు అవివాహితులైతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుంది’’ అని బెంచ్ స్పష్టం చేసింది. మహ్మద్ షాదాబ్ ఖాన్‌కి 2020లో ఫరీదా ఖాతూన్‌ అనే మహిళతో పెళ్లి అయ్యిందని విచారణలో తేలింది. దంపతులకు ఒక పాప కూడా ఉందని తెలుసుకున్న కోర్ట్.. వివాహ వ్యవస్థల విషయంలో రాజ్యాంగ నైతికత, సాంఘిక నైతికతలు సమతుల్యంగా ఉండాలని, ఈ విషయంలో వైఫల్యాలు చోటుచేసుకుంటే సమాజంలో శాంతి, సామరస్య పరిస్థితులు మసకబారతాయని అలహాబాద్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article