- టీడీపీని వీడిన 5 కుటుంబాలు
- స్వాగతించిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
రామచంద్రపురం
రామచంద్రాపురం మండలం టిడిపి నుంచి వైసీపీలో చేరికలు వెల్లువెత్తుతున్నాయి. సేవా దృక్పథం కలిగిన చెవిరెడ్డి కుటుంబం, యువ కెరటం, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు తరలివస్తున్నారు. బుధవారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో మండల పరిధిలోని అనుప్పల్లి పంచాయతీలో 5 కుటుంబాలు వైసిపి కండువాలు కప్పుకున్నారు.
పల్లెల ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నిరంతరంగా అందుబాటులో ఉండే యువనాయకుడు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట తాము నడిచేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేశారు. మే 13వ తేదీన ఈవీఎం వరుస నంబర్ – 1 లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని వారు స్పష్టం చేశారు. మా పట్ల, వైసీపీ పాలన పట్ల ఎంతో అభిమానంతో, నమ్మకంతో పార్టీలో చేరిన వారికి అండగా ఉంటానంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భరోసా కల్పించారు.
వైసీపీలో చేరిన వారిలో.. జల్లా సిద్దయ్య యాదవ్, జల్లా రామకృష్ణయ్య యాదవ్, జవ్వాది కృష్ణయ్య యాదవ్, ఆరుపల్లి కృష్ణమూర్తి యాదవ్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాంబ యాదవ్, మండల కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, మల్లయ్య, గురుస్వామి, చంద్ర, చిరంజీవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

