గాజువాక :-
డోర్ టు డోర్ ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్
అధిక సంఖ్యలో పాల్గొన్న కూటమి కార్యకర్తలు
రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కూటమితోనే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జీవీఎంసీ స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాధం అన్నారు. మంగళవారం జీవీఎంసీ 87 వార్డు ఎన్టీఆర్ నగర్ నిర్వశిత కాలనీ లొ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైంది అని అప్పుల్లో, రౌడీయిజం లొ రాష్ట్రన్ని మొదటి స్థానంలొ నిలబెట్టిన ఘనత ప్రస్తుత ప్రభుత్వనిది అని హేద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ తో వచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. బంగారు భవిష్యత్ కూటమి తోనే సాధ్యమాని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి కూటమిని గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం వార్డు అధ్యక్షులు రాజన్ రాజు, విజయరామరాజు, సెక్రెటరీ సత్తిబాబు, సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య, పావడ రమణమూర్తి, జనసేన నాయకులు ఇందిరా ప్రియదర్శిని, మల్లా రాము , మజ్జి పద్మ , జి. రాము, జి. శ్రీను, నూకరాజు,కళ్యాణ్ చక్రవర్తి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు.

