మార్కాపురం:మార్కాపురం పట్నంలోని టీడీపీని వీడి 30 మంది యువత ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరికవైస్సార్సీపీ లో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించిన మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నామంచి చేసేవారికే ప్రజల అండజగనన్నపాలనమెచ్చేభారీగావలలు*
రాష్టంలో యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు గత ఐదేళ్లుగా ఎంతో కృషి చేశారని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు గారు అన్నారు. మంగళవారం మార్కాపురం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన 30 మంది టిడిపికి చెందిన యువకులు టీడీపీని వీడి 18 వ వార్డు కౌన్సిలర్ కరీముల్లా, నాయకులు టి. వెంకటరావు, బెల్లకొండ గోపీ, కంభం వెంకట రమణ గార్ల ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు గారి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కాపురం పట్టణం, జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు గారిని కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా పార్టీ కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై వైసీపీ లో చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారి విజయానికి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విజయానికి కృషి చేస్తామన్నారు. పార్టీ లో చేరిన వారిలో ఏనుగుల సాయి, ఏనుగుల శివ, ఏనుగుల ప్రవీణ్, భూపని కిరణ్, ఇవి వెంకట్, సాయి, అశోక్, శివారెడ్డి, శేఖర్, అజయ్, విష్ణు, మౌలాలి, హరి, కాశీ, మహీంద్రా, మహేష్, ఉమా మహేష్, రేవంత్, మోహన్, అరవింద్, రంగా, మనోజ్, శివ, గోపీ, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.*


