చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో చంద్రగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు , భావజాలాలకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవ, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చంద్రగిరి నుంచి చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు విరూపాక్షి నవీన్ రెడ్డి మరియు సి. శ్రీనివాస్ రెడ్డి, టి. ప్రసాద్ లు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ సమన్వయకర్త ఉన్నం రాజేందర్ నాయుడు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

