Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఎప్పటికీ వైఎస్సార్‌సీపీతోనే ఉంటాం

ఎప్పటికీ వైఎస్సార్‌సీపీతోనే ఉంటాం

వేంపల్లె
ఎప్పటికీ వైఎస్సార్‌సీపీతోనే ఉంటామని నేలవరంతాండాకు చెందిన పలువురు నాయకులు తెలిపారు. మంగళవారం ఆ గ్రామానికి చెందిన శ్రీను నాయక్, విజయనాయక్, ఆంజనేయులు నాయక్, బికె నాయక్, చంద్రనాయక్, వెంకటయ్య నాయక్, సురేంద్ర నాయక్, వెంకటస్వామి నాయక్, రాజు నాయక్, జూల నాయక్, శంకర్ నాయక్ తో పాటు మరికొన్ని కుటుంబాలు వేంపల్లె విలేకరులతో మాట్లాడారు. సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అభిమానులమని, అలాగే వేంపల్లె జడ్పీటీసీ ఎమ్.రవి కుమార్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మా గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీకీ అత్యధిక మెజార్టీ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. సోమవారం మా గ్రామంలో ప్రచారానికి వచ్చిన టిడిపి నాయకులు ప్రలోభాలకు గురిపెట్టి, మాయమాటలతో తమ కుటుంబాలకు పార్టీ కండువా కప్పినట్లు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article