పులివెందుల టౌన్
అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ మన అందరికి స్ఫూర్తి అని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్ అన్నారు మంగళవారం పట్టణంలోని ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్ అధ్యాపకులతో కలసి అల్లూరి సీతారామరాజు చిత్రపటం వద్ద పుష్పగుజ్జాలు ఉంచి నివాళులర్పించారు అనంతరం అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం మొదలు పెట్టి, స్థానికులతో కలిసి గిరిజనులపై సాగుతున్న బ్రిటీష్ అధికారుల దౌర్జన్యాలపై అల్లూరి తిరుగుబాటు చేశారన్నారు కొద్దికాలంలోనే అల్లూరికి ప్రజల్లో ఆదరణ పెరిగి ఉద్యమ తీవ్రరూపం దాల్చిందన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు పేరు మీద జిల్లా ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారి పోరాటపటిమ మన అందరికి స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ ఆక్టివిటీ అధికారి డాక్టర్ రాజేష్,
అధ్యాపకులు అరుణ, డాక్టర్ కీర్తి రెడ్డి, డాక్టర్ జయమ్మ, డాక్టర్ నివేదిత, డాక్టర్ సాయి శ్రీనివాస్, డాక్టర్ రాజశేఖర్, కె. సుబ్బారెడ్డి, ఎన్.వి. సుబ్బారెడ్డి, కళాశాల సిబ్బంది కవిత, సుధారాణి,కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

