ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి
పోరుమామిళ్ల:
బద్వేల్ నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మను కడప ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లి గ్రామపంచాయతీ లోని వాసుదేవపురం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారని మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్, రామ్మోహన్ రెడ్డి, బూత్ కన్వీనర్ శ్రీనివాసులురెడ్డి, ఎంపిటిసి రవి, వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి, లక్కీనెని ఓబయ్య, అల్లూరయ్య, డాక్టర్ బాబు, వెంకట్ రెడ్డి, గంగరాజు, నాగరాజు, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రామిరెడ్డి, పెద్ద గురువారెడ్డి, గురుస్వామి, శీను, సుబ్బరాయుడు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

