నందమూరి వసుంధర దేవి.
లేపాక్షి: హిందూపురం నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలుపు అభివృద్ధికి మలుపు అని బాలయ్య భార్య నందమూరి వసుంధర దేవి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పరపల్లి, మైదుగోళం గ్రామాల్లో వసుంధర దేవి రోడ్ షో నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసన సభ్యులుగా చేసిన అభివృద్ధి గతంలో ఏ శాసనసభ్యులు చేయలేదన్నారు. ముచ్చటగా మూడోసారి బాలయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే హిందూపురం నియోజకవర్గాన్ని అనంతమైన అభివృద్ధి చేసి చూపిస్తారని ఆమె తెలిపారు. హిందూపురం నియోజకవర్గానికి నందమూరి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉండడం వల్లనే బాలయ్యను రెండుసార్లు అత్యధిక మెజారిటీతో గెలిపించారని మరోసారి కూడా గెలిపించేందుకు హిందూపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వసుందరా దేవి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మైదు గోళం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వసుంధర దేవి మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే మైదుగోళం గ్రామానికి రహదారిని ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. హిందూపురం నియోజకవర్గం లో బాలయ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామాంజినమ్మ, సదాశివరెడ్డి, సర్పంచ్ రత్నమ్మ, లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకటరెడ్డి, వీర శేఖర్, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ,మంజు, నరసింహమూర్తి, కదిరప్ప, మైదుగోళంలో సర్పంచ్ రామచంద్రారెడ్డి నాయకులు నరసింహమూర్తి ఖలీల్ భాష తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా లేపాక్షి లో జరిగిన ప్రచార కార్యక్రమంలో టిడిపి కన్వీనర్ జయప్ప ,నాయకులు ఆనంద్ కుమార్, షేక్షావలి, ఎన్.బి.కె మూర్తి, అన్నప్ప, అంగడి అంజి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కంచి సముద్రం ,సిరివరం ,మానేపల్లి, పులమతి, కోడిపల్లి ,చోళ సముద్రం, నాయన పల్లి, కల్లూరు, కొండూరు ,గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

