ఏపిని అప్పుల ఊబిలో నెట్టింది వైసిపి
ఛంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ ఒన్
ఏపీ ప్రజలు వైసీపీని తిరస్కరించనున్నారు
అభివృద్ధికి ఏకైక గ్యారెంటీ ఎన్డీఏ కూటమి
దేశంలో,రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే అధికారం
మూడు రాజధానుల పేరిట రాష్ట్రం లూటీ
అభివృద్ధి నిల్-అవినీతిలో ఫుల్ స్పీడ్
వికసిత ఆంధ్ర-వికసిత భారత్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ
ఉభయగోదావరి జిల్లాల ప్రతినిధి:
అభివృద్ధికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే కూటమేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ యువత శక్తిని ప్రపంచమే గుర్తించిందన్నారు.ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయని ఒకటి కాంగ్రెస్ పార్టీ,కాగా రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.మూడు రాజధానుల పేరిట ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేయాలనుకుందని ,ఈ లోగా అర్థికంగా అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలో వేమగిరి వద్ద నిర్వహించిన వికసిత ఆంధ్ర ,వికసితభారత్
బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించి మే 13న కొత్త అభివృద్ధిని మీరు సాధించనున్నారని తెలిపారు.రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు రానుంద న్నారు.దేశవ్యాప్తంగా విధానసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నింటిలో ఎన్డీఏ కూటమి గెలుపొంద నుందన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడింద న్నారు.అభివృద్ధిలో రాష్ట్రం నిల్ అవినీతిలో ఫుల్ స్పీడ్ గా ఉందన్నారు .వైసిపి రాష్ట్ర అభివృద్ధిని పట్టాలు తప్పించిందని,ఈ ప్రభుత్వం సంపూర్ణ మధ్య పాన నిషేధాన్ని అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిందని,కానీ ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించే దుస్థితికి దిగిందన్నారు.
వైసిపి నుండి అభివృద్ధిని ఆశించటం వృధా,ఏపీ ప్రజలు వైసీపీని తిరస్కరిం చనున్నారని తెలిపారు
వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమన పట్టిందన్నారు.చంద్రబాబు పాలనలో రాష్ట్రం అబివృద్దిలో టాప్ లో ఉందన్నారు.వైసిపి రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కిందన్నారు.అభివృద్ధికి ఏకైక గ్యారెంటీ ఎన్డీఏ కూటమేనని స్పష్టంచేశారు
వైకాపాకు ఐదేళ్ల అవకాశం ఇచ్చిన రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్లిందని విమర్శిం చారు దేశంలో,రాష్ట్రంలో ఇండియా కూటమిదే అధికారమన్నారు.వైకాపా ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ను భారీ అప్పుల్లో కూరుకు పోయేలా చేసిందన్నారు
రాజమండ్రి ఎంపీ అభ్యర్థిని దగ్గుపాటి పురందరేశ్వరి, నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ,కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ లతోపాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులందరికీ గెలిపించాలని కోరారు