వేలేరుపాడు:వేలేరుపాడు మండలంలో వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆకుల దొరబాబు అనుచర గణంతో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు, ఈ సందర్భంగా దొరబాబు ప్రజా భూమితో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పార్టీకి ఎనలేని సేవలందించానని, అయినప్పటికీ వేలేరుపాడు మండలంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న పోలవరం సమస్యలను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం పలుమార్లు మాట తప్పిందని, దానితో తనను నమ్ముకున్న ఎన్నో కుటుంబాలకు ముఖం చూపించలేని దుస్థితి నెలకొందన్నారు ,ఎవరు అడగకుండానే సీఎం జగన్మోహన్ రెడ్డి ,పోలవరం ముంపు మండలాల ప్రజలకు లేనిపోని ఆశలు పెట్టారని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఎకరా భూమికి లక్ష 15000 ఇచ్చిన, ప్రతి ఎకరాకు ఐదు లక్షల రూపాయలు తాను అందించనునట్లు హామీ ఇవ్వడం జరిగిందన్నారు, అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ,ఆరు లక్షల 36000, ఆరు లక్షల 86000, గల ప్యాకేజీలను 10 లక్షలకు పెంచి ఇస్తానని పలుమార్లు హామీల వర్షం కురిపించారని, గెలిచి ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదు అన్నారు, కనీసం వైసీపీలో ఎమ్మెల్యే, మంత్రి స్థాయివారు సైతం, సీఎం వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు వినిపించే సత్తా కనిపించలేదని ఎద్దేవా చేశారు, తాను సైతం జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు ఏపించి గెలిపించానని, కానీ కాలానుగుణంగా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయేసరికి మరల వారికి ముఖం చూపించలేకపోయాను అన్నారు, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తుందని నమ్మి,ఈ విధంగానైనా రానున్న టిడిపి ప్రభుత్వంలో తనను నమ్మిన ముంపు మండలాల ప్రజలకు న్యాయం చేయగలనన్న నమ్మకంతో తెలుగుదేశం తీర్థం ,అనుచర గణంతో పుచ్చుకోవటం జరిగిందన్నారు, ఇప్పటికే తన వెంట 60 కుటుంబాలు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సమక్షంలో టిడిపిలో చేరారని, రానున్న కొద్ది రోజుల్లో ఎన్నికలకు ముందే, మరెన్నో కుటుంబాలు చేరేందుకు సంసిద్ధులై ఉన్నారన్నారు. ఈ విధంగా కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు సైకిల్ గుర్తు పైన ,చెర్రీ బాలరాజుకు గాజు గ్లాస్ గుర్తుపైన అత్యధిక ఓట్లు వేపించి గెలుపుకు తన వంతు సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు, తాను తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీలకతీతంగా అనేకమంది హర్షం వ్యక్తం చేయటం జరిగిందని దొరబాబు పేర్కొన్నారు.
