వేముల :ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ద్వేయమని ఆర్కే వ్యాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి అన్నారు.జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశానుసారం ఆర్కే వ్యాలీ సిఐ గోవింద్ రెడ్డి,డి.టి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ రాజా ప్రభాకర్ ఆధ్వర్యంలో మండలంలోని క్రిటికల్ గ్రామాలైన మబ్బుచింతలపల్లి,వేముల, పెద్దజూటూరు,చింతలజూటూరు, నారేపల్లి గ్రామాలలో స్పెషల్ పార్టీ బలగాలతో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.ప్రజలలో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడమే పోలీసు ద్వేయమని కావున ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ధనుంజయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.