కంది కుంటకు ప్రచారజోరు.
తనకల్లు మండలంలో వైసీపీకి బిగ్ షాక్
150 కుటుంబాలు టిడిపిలో చేరిక
తనకల్లు:వైసీపీ వారు చెప్పే మాయ మాటలకూ ఎవరు నమ్మవద్దని కదిరి టీడీపీ అభ్యర్థి కంది కుంట వెంకట ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తనకల్లు మండలంలోని చీకటి మానిపల్లి, బొంతలపల్లిలో ప్రచారం నిర్వహించడం జరిగింది.ప్రచారంలో కంది కుంటకు మద్దతుగా వేలాదిమంది తరలి వచ్చారు. బొంతలపల్లిలో వైసీపీ నాయకులు నీలకంఠ, చాకీ చంద్రశేఖర్ వారితోపాటు 150 కుటుంబాలు టిడిపిలోకి చేర్పించారు.వారికి కంది కుంట పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈసందర్బంగా కంది కుంట మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్లకు ఒకరిని పట్టకచ్చి ఎమ్మెల్యగా నిలబెడుతున్నారు వారు సంపాదనే ద్యేయంగా మారి ప్రజలకు ఏమి చేయలేక పోతున్నారు. ఈరోజు గ్రామాలలో తాగు, సాగు నీటికి ఇబ్బదులు పడుతున్నారు. పంచాయతీలకు నిధులు లేక సర్పంచులు ఉత్సవ విగ్రహంలాగా ఏమి చేయలేకపోతున్నారు.మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో అభివృద్ధి చెందక యువతకు ఉద్యోగాలేక, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లుకు బానిస అవుతున్నారు.రైతులకు డ్రిప్, వ్యవసాయపరికారాలు, గిట్టు బాటు ధర లేదు,రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తోనే సాధ్యమని, టీడీపీ ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు వల్ల ప్రజలకు మేలు జరుగుతుందిని అయన తెలిపారు. టీడీపీలోకి చేరిన వారితోపాటు అందరితో టీడీపీకి ఓటు వేసే విదంగా కృషి చేసి,అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బొంతలపల్లితోపాటు,చండ్ర రాయునిపల్లి, పాల్యంవారి పల్లి, వడ్డేపల్లి, పూలకుంటపల్లి గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున టిడిపిలోకి చేరడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు పట్ల సొంత పార్టీ నాయకులు విసుగు పోయి టిడిపిలోకిచేరుతున్నామన్నారు. కార్యక్రంలో మండలకన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, కోటిరెడ్డి, మాజీ సర్పంచ్ దస్తగిర్, నాయకులు శంకర్ నాయుడు, నాగేంద్ర ప్రసాద్,రాజారెడ్డి, కుంచె నాగేంద్ర ప్రసాద్,సోంపాళ్యం నాగభూషణ, మీరాసి వేమన్నారాయణ, గోవిందు, రాధకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
