ఈ ఘనత కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంజాద్ భాషాదే
డా.జీలాన్
కడప సిటీ :డాక్టర్ జిల్లా గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎడారిలా మారకూడదు అని గత తెలుగు దేశం ప్రభుత్వాలు తెలుగుగంగాప్రాజెక్టు ,హంద్రీనీవ ,గాలేరు, నగిరి,సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పట్టిసీమ ప్రాజెక్టు ఎన్నో ఆయకట్టులు కడితే,ఈ వైకాపా ప్రభుత్వం నీటి పారుదల శాఖను గాలికి వదిలేసింది . పోలవరంకు రివర్స్ టెండరింగ్ పేరిట పంగనామాలు పెట్టేసి , తుంగభద్ర బోర్డు ఊసే లేకుండా , కృష్ణ – గోదావరి జలాలను సక్రమంగా ఉపయోగించడంలో పూర్తిగా విఫలమై నది.ఈ రోజు నీటి కష్టాలకు, మహిళలు బిందెలతో రోడ్డు ఎక్కాల్సిన దుస్తితిను తీసుకోచ్చింది . పట్టిసీమ పనికిరాదు అని అసెంబ్లీలో వత్తాసు పలికిన కడప ఎం.ఎల్.ఎ ఈ రోజు ఎం సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నాం అన్నారు. ఆ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణ డెల్టాకు గోదావరి నీళ్ళు సరఫర చేయడంతో శ్రీశైలం జలాశయం నుండి రాయలసీమకు నీళ్ళు అధికంగా తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు. అదీ తెలుగు దెశం చూపించిన చొరవ , మన చంద్రబాబు గారు చేసిన ఘనత . ఈరోజు మైలవరం నుండి నీళ్ళు కడపకు వస్తున్నాయి అంటే ఆ రోజు తెదెపా నిర్మించిన కాలువలద్వారానే .రాయలసీమకు కడప జిల్లాకు నీటి విషయంలో ముందు చూపుతో పనిచేసిన ప్రభుత్వం ముమ్మాటికి తెలుగు దేశం ప్రభుత్వమే .కడపలోచెరువులు కబ్జాకు గురవుతున్నా వెంచర్లు వేస్తున్నాబావులుమూతబడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూసి తీరా ఇపుడు బాద్యతరహితంగవ్యవహరించడం వైకాపా నిర్లక్ష్య వైఖరికు పరాకాష్టా. బటన్ నొక్కుతాం అని బడాయిలు చెప్పె ఈ బటన్ ప్రభుత్వం ఇవాళ మొటర్ బటన్ నొక్కితే కుళాయికు నీళ్ళు వారాల తరబడి రాని పరిస్తితి ఏర్పడింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున కడప ప్రజలు సైకిల్ గుర్తుపై బటన్ నొక్కి ఈ అసమర్థ వైకాపా ప్రభుత్వానిని ఇంటికి పంపాలని సవినయంగా కోరుతున్నాం అని తెలిపారు . ఈ సమావేశంలో తెదెప నాయకులు వేనుగోపాల్, ఎస్.కే.బాషా. శీను నాయక్ , డైమండ్ మహబూబ్ ఖాన్, అశోకాతదితరులుపాల్గొన్నారు.