పలువురి గాయాలు

ఇరువర్గాలపై కేసు నమోదు
పులివెందుల :పులివెందుల పట్టణంలోని అంబకపల్లి రోడ్డు జ్యోతి హాస్పిటల్ వద్ద మద్యం మత్తులో యువకులు ఘ ర్షణ పడిన సంఘటనలో పెద్ద జుటూరుకి చెందిన వేణు, వంశీ, పాండు కృష్ణారెడ్డి, జస్వంత్ పట్టణం లోని ఎర్రగూడి పాలెం కు చెందిన మల్లికార్జున చందు, పండు, నాగిరెడ్డి మరి కొంతమంది యువకు లకు గాయాలయ్యాయి.పోలీసు లు తెలిపిన వివరాలకు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప రోడ్డు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద వేణు మరియు మరి కొంతమంది కారు తిప్పుకుం టూ ఉండగా అదే సమయంలో బైక్ పై వస్తున్న ఎరగుడు పాలెంకు చెందిన మల్లికార్జున వస్తున్న సమయంలో బైక్ కు కారు తగిలింది అని కారులో వెళ్లేవాళ్లు అక్కడ కారు ఆపకుండా వెళ్లడంతో మల్లికార్జున తన మిత్రులకు ఫోన్ చేసి కారును వెంబడించి అంబకపల్లి రోడ్డు లోని జ్యోతి హాస్పిట ల్ సమీపంలోకి వచ్చేసరికి క్రాస్ చేశారని అక్కడ మల్లికార్జున మరియు అతని మిత్రులు కారులో వున్న వారితో మాట మాట అనుకుంటా ఘర్షణ కు దిగారు.ఇరువురు వారికి సంబంధించిన వారికి ఫోన్ చేసుకోవడంతో వారందరూ అక్కడకి చేరుకో ని ఇరువర్గాలు కట్టెలతో బండరాళ్లతో ముష్టి యుద్ధాలు చేసుకున్నారు.చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు ఇరువర్గాలను విడిపించే ప్రయత్నంచేయగా వారి మీదకి కూడా వెళ్లడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘర్షణలో ఇరువర్గా లకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సంఘ టన స్థలము చేరుకుని ఇరువురుగాలని చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాయాలైన వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

