చంద్రగిరి:చంద్రగిరి నియోజక వర్గంలో గత ఐదేళ్లుగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశాం… కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మార్చి దేశానికి ఆదర్శంగా నిలబెట్టడం జరిగింది… ఈ ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరిస్తే మరింత అభివృద్ధి చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెవిరెడ్డి లక్ష్మి పేర్కొన్నారు. చంద్రగిరి భారతి నగర్, ప్రశాంతి నగర్, నాయి బ్రహ్మణ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లిన ఆమె గత ఐదు సంవత్సరాలలో ప్రతి పల్లెను ప్రగతి పథంలో నిలబెట్టినట్టు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదరించి ఆర్థికంగా ఆదుకుంటే, ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఎలాంటి ఆపద వచ్చినా.. పండగొచ్చిన… కష్టమొచ్చిన ఆదుకున్నారని అన్నారు. కోట్ల రూపాయల నిధులతో ప్రతి పంచాయతీలో సచివాలయ భవనాలు, రైతు భరోసా భవనాలు, హెల్త్ క్లినిక్ లు, ధ్యాన మందిరాలు, జగనన్న సమావేశ మందిరాలు, సిసి రోడ్లు, మరుగు కాలువలు అండర్ డ్రైనేజీ పనులు, తారురోడ్లు, గ్రావెల్ రోడ్డు పనులు చేశారని ఆమె వెల్లడించారు. నాడు నేడు పథకంలో 70 శాతం పాఠశాలలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కరోనా సమయంలో…. వరదల సమయంలో ప్రజలను ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దగ్గరుండి ఆదుకున్నారని ఆమె వెల్లడించారు. ఏ గ్రామానికి వెళ్లి చూసిన చెవిరెడ్డి మార్కు అభివృద్ధి కనబడుతుందని… ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించిన చెవిరెడ్డి కుటుంబాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జడ్పీటీసీ యుగందర్ రెడ్డి, సర్పంచ్ రూపరామ్మూర్తి,
కొత్త పాటి హరి ప్రసాద్ రెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, విద్యార్థి నాయకుడు సూరి, సిద్ధిక్ భాష పసలనాగరాజ, కోటేశ్వర్ రెడ్డి, ఏ. రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.